సమస్యలు పరిష్కరించరూ..
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:28 AM
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రెండో రోజు నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు.
రెండు రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన
విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రెండో రోజు నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఏపీ మెడికల్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు రమణ, శ్రీనివాస్‌లు మాట్లాడుతూ, తమను తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియో అందించి, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.