Share News

అదనంగా ధాన్యం తీసుకున్నారు

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:00 AM

చీపురుపల్లి మండలం రామాంజనేయ మెడ్రన్‌ రైసు మిల్లర్‌.. 40 కేజీల ధాన్యం బస్తాకు ట్రక్‌షీట్‌ కంటే 3.50 కేజీలు అదనంగా తీసుకున్నారంటూ జిల్లా రైతు సంఘం నాయకులు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.

అదనంగా ధాన్యం తీసుకున్నారు

  • పీజీఆర్‌ఎస్‌లో రైతు సంఘం నాయకుల ఫిర్యాదు

విజయనగరం, కలెక్టరేట్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి మండలం రామాంజనేయ మెడ్రన్‌ రైసు మిల్లర్‌.. 40 కేజీల ధాన్యం బస్తాకు ట్రక్‌షీట్‌ కంటే 3.50 కేజీలు అదనంగా తీసుకున్నారంటూ జిల్లా రైతు సంఘం నాయకులు సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ మిల్లర్‌పై చర్యలు తీసుకోవాలని రైతు సంఘ నాయ కులు బి.రాంబాబు, జి.కృష్ణ డిమాండ్‌ చేశారు.

గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురంలోని గ్రా మ కంఠం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని గ్రామానికి చెందిన జి.సూర్యనాయణ, పి.కృష్ణ పీజీఆ ర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేయాలని కోరారు.

మెంటాడ మండలంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలంటూ బొబ్బిలి గ్రామ అంబేడ్క ర్‌ పోరాట సమితి అధ్యక్షుడు సోరు సాంబయ్య కోరారు. మండ లంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూము లను దళిత పేద కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 ఎకరాలు పంపిణీ చేయాలని కోరారు.

297 వినతులు..

కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 297 వినతులు వచ్చాయి. వీటిని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, జేసీ సేతు మాధవన్‌, డీఆర్వో శ్రీని వాస్‌మూర్తి, డిప్యూటీ కలెక్టర్లు వినతులు స్వీకరించారు. రెవెన్యూకు సంబంధించి 149, డీఆర్‌డీఏ 64, పంచా యతీరాజ్‌ 22, మున్సిపల్‌ పరిపాలన 2, విద్యుత్‌ శాఖ కు 4, ఇతర శాఖలకు మిగిలిన వినతులు వచ్చాయి.

Updated Date - Jan 06 , 2026 | 12:00 AM