Share News

నడిరోడ్డుపై ఆటోను లాక్కున్నారు

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:23 AM

మండలంలోని బొడ్డవర గ్రామం వద్ద మంగళవారం ఒక సంస్థకు చెందిన ఫైనాన్స్‌ రికవరీ ఏజెంట్లు అలజడి సృష్టించారు.

నడిరోడ్డుపై ఆటోను లాక్కున్నారు

  • బొడ్డవరలో అలజడి సృష్టించిన రికవరీ ఏజెంట్లు

ఎస్‌.కోట రూరల్‌, నవంబరు 23(ఆంధ్రజ్యో తి): మండలంలోని బొడ్డవర గ్రామం వద్ద మంగళవారం ఒక సంస్థకు చెందిన ఫైనాన్స్‌ రికవరీ ఏజెంట్లు అలజడి సృష్టించారు. ధారపర్తి పంచాయతీ బొడ్డవర గ్రామానికి చెందిన ఒక గిరిజన యువకుడు తన ఆటోతో జంక్షన్‌కు వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఫైనాన్స్‌ రికవరీ ఏజెంట్లు ఆటోను ఆపారు. ఆటోలో నుంచి గిరిజనుడి ని కిందకు దించేశారు. ఆటోలో కూర్చున్న అతని కుమారుడిని కూడా దించేసి, ఆటో పట్టుకుపోయే ప్రయత్నంచేశారు. బొడ్డవర జంక్షన్‌లో సుమారు పావుగంట పాటు రోడ్డు మధ్యలో గిరిజనుడికి, సదరు రికవరీ ఏజెంట్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది వచ్చి ఆటోను తీసుకునే పద్ధతి ఇదికాదని వాదించారు. దానికి రికవరీ ఏజెంట్లు.. ‘వీడి డబ్బులు మీరు కడతారా..’ అంటూ వారిపై విరుచుపడ్డారు. అనంతరం ఆటోను తీసుకుపోయారు. తాను సమయం కావాలని వేడుకున్నా వారు కనికరించలేదని సదరు యువకుడు విలపించాడు.

Updated Date - Nov 24 , 2026 | 12:23 AM