Share News

మాయ మాటలు చెప్పి.. నోటికి ప్లాస్టర్‌ వేసి..

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:27 AM

ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలికి ఓ గుర్తుతెలియని దుండగురాలు మాయ మాటలు చెప్పి, నోటికి ప్లాస్టర్‌ వేసి.. బంగారు గొలుసును చోరీ చేసిన ఘటన బొబ్బిలి పట్టణ పరిధిలోని మల్లమ్మపేట గ్రామంలో మంగళవారం పట్టపగలు చోటుచేసుకుంది.

మాయ మాటలు చెప్పి.. నోటికి ప్లాస్టర్‌ వేసి..

  • వృద్ధురాలి నుంచి బంగారు గొలుసు చోరీ

బొబ్బిలి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలికి ఓ గుర్తుతెలియని దుండగురాలు మాయ మాటలు చెప్పి, నోటికి ప్లాస్టర్‌ వేసి.. బంగారు గొలుసును చోరీ చేసిన ఘటన బొబ్బిలి పట్టణ పరిధిలోని మల్లమ్మపేట గ్రామంలో మంగళవారం పట్టపగలు చోటుచేసుకుంది. గ్రామా నికి చెందిన కోడి బంగారమ్మ అనే వృద్ధురాలు తన కోడలు హైమావతితో కలిసి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నివాసం ఉంటోంది. కోడలు టైలరింగ్‌ పనిమీద వెళ్లడంతో బంగారమ్మ ఇంట్లో ఉంది. ఇంతలో సుమారు 40 ఏళ్ల లోపు వయసు కలిగిన ఓ మహిళ ఇంటికొచ్చి ‘నన్ను మీ కోడలు పంపించింది’ అని మాయ మాటలు చెప్పి, నోటికి ప్లాస్టర్‌ అంటించి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయింది. బంగారమ్మ వృద్ధురాలు కావ డంతో ఏమీ చేయలేక గట్టిగా కేకలు వేసింది. వెంటనే పొరుగున గల అక్కమ్మ గమనించి వెళ్లి ఆరా తీసింది. ఈ విషయాన్ని బాధితురాలి కుమారుడు సాయిబాబుకు ఫోన్‌లో సమాచారం అందించింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ నారాయణరావు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీమ్‌ ఆధారాలు సేకరించింది.

Updated Date - Mar 04 , 2026 | 12:27 AM