మెటల్ వేశారు.. తారు మరిచారు
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:31 AM
మండలంలోని శేషపుపేట నుంచి వల్లా పురం మెయిన్ రోడ్డు వరకూ మెటల్ వేసినా తారువేసి రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనచోదకులు, ప్రయాణికులు అగచాట్లకు గురవుతు న్నారు.
xగుర్ల, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని శేషపుపేట నుంచి వల్లా పురం మెయిన్ రోడ్డు వరకూ మెటల్ వేసినా తారువేసి రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనచోదకులు, ప్రయాణికులు అగచాట్లకు గురవుతు న్నారు. రోడ్డుపై మెటల్ వేసి మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు తారు వేసే పనులు పూర్తిచేయకపోవడంతో రాళ్లు తేలడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇక్కడ ప్రజల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం తారురోడ్డునిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. రోడ్డు పనులు చేపట్టి మెటల్ పనులు పూర్తిచేశారు. అయితే తారురోడ్డు మాత్రం వేయలేదు. దీంతో గ్రామస్థులతోపాటు ప్రయాణికులు అగచాట్లకు గురవుతున్నారు. నిత్యం ఈ రోడ్డు వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటోంది. మెటల్ వేసి విడిచిపెట్టడం వల్ల చీకటిపడిన తర్వాత ఈ మా ర్గంలో వచ్చిపోయే వాహనాలు పల్టీలు కొడుతుండడంతో గాయపడుతు న్నామని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు పనులు ఏర్పాటు చేయాలని, తారు రోడ్డు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. కాగా మరో వారం రోజుల్లో రోడ్డు పనులు జరుగుతాయని ఆర్‌అండ్‌బీ జేఈ శ్రీనివాస్ తెలిపారు.