Share News

సత్తా చాటారు

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:58 PM

విజయనగరం జిల్లాకు చెందిన పలువురు విద్యా ర్థులు ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

సత్తా చాటారు

విజయనగరం జిల్లాకు చెందిన పలువురు విద్యా ర్థులు ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలకు..

రాజాం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు కంచరాం జడ్పీ ఉన్నత పాఠ శాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎం.కార్తీక్‌ ఎం పికైనట్టు హెచ్‌ఎం వై.గౌరినాయుడు సోమవారం తెలిపారు. ఈనెల 4న శ్రీకాకుళంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అండ ర్‌-17 కేటగిరీలో కార్తీక్‌ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 9 నుంచి 10వ తేదీ వరకు కాకినాడలో జరు గుతాయన్నారు. ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్‌, లెంక శ్రీనివాసరావు, పి.వేణుగోపాల్‌, ఎం.గౌరీశంకర్‌, బి.మహేష్‌, పీడీ టి.దుర్గారావు, పీఈ టీ ఎన్‌.నాయుడు అభినందించారు.

రెజ్లింగ్‌ పోటీలకు..

గరివిడి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీరామ్‌ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఈనెల 1న కొండవెలగాడలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈనెల 10, 11, 12 తేదీల్లో పల్నాడు జిల్లా కారంపూడి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరగబోవు పోటీల్లో పాల్గోనున్నారు. హెచ్‌ఎం ఎం.నిర్మలా, పీడీ ఎం.ఉదయ్‌కుమార్‌, ఎస్‌ ఎంసీ చైర్మన్‌ వెంకటేష్‌ అభినందించారు.

కబడ్డీ పోటీలకు..

పూసపాటిరేగ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ కబడ్డీ జట్టుకు రెల్లివలస హై స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని పతివాడ రోజా ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో జరిగిన సబ్‌ జూనియర్స్‌ కబడ్డీ టోర్నమెంటులో రెల్లివలస హై స్కూల్‌ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్స్‌ కబడ్డీ జట్టుకు పతివాడ లలిత(9వ తరగతి), మీసాల శ్రావణి(8వ తరగతి) లు ఎంపికయ్యారు. వీరు ఈనెల 10, 12 తేదీల్లో నూజివీడులో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్న మెంటులో ఆడనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈనెల 16, 18 తేదీల్లో జరగనున్న జూనియర్‌ జట్టుకు పతివా డ రోజా ఎంపికయ్యారు. వీరిని హెచ్‌ఎం బలివాడ శంకరరావు, పీడీ శ్రీనివాసరావు అభినందించారు.

రగ్బీ పోటీలకు..

దత్తిరాజేరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లా స్థాయి రగ్బీ పోటీల్లో షికారుగంజి ఏపీ మోడల్‌ స్కూ ల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీల కు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన ఎం.యమున, జి.రిషిత అద్భుత ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ ఎం.ఈశ్వర రావు తెలిపారు. పీడీ రాజేష్‌ అభినందించారు.

Updated Date - Oct 05 , 2026 | 11:58 PM