Share News

కంకర వేశారు.. పనులు మరిచారు

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:15 AM

మండలంలోని అరసాడ నుంచి బాగెమ్మ పేట వెళ్లే ఆరు కిలోమీటర్లు రహదారి పనులు అర్థాంతరంగా నిలిచిపోయా యి. ప్రధానంగా కంకర వేసి పనులు పూర్తి చేయకపోవడంతో వాహనాలు పల్టీలు కొడుతుండడం వల్లచోదకులు గాయపడుతున్నారు.

కంకర వేశారు.. పనులు మరిచారు
రాళ్లు తేలిన బాగెమ్మపేట రహదారి :

వంగర, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అరసాడ నుంచి బాగెమ్మ పేట వెళ్లే ఆరు కిలోమీటర్లు రహదారి పనులు అర్థాంతరంగా నిలిచిపోయా యి. ప్రధానంగా కంకర వేసి పనులు పూర్తి చేయకపోవడంతో వాహనాలు పల్టీలు కొడుతుండడం వల్లచోదకులు గాయపడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణా నికి ప్రభుత్వం రూ.3.5 కోట్లు మంజూరుచేసింది. దీంతో రెండు నెలల కిందట ఓ కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించారు. రహదారిని తవ్వి వెట్‌మిక్స్‌ కంకర వేసి వదిలేయడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. రోడ్డుపై కంకరతేలడంతో వాహన చోదకులు అదుపుతప్పి పడి పోతున్నారు. సంబందిత అధికారులు స్పందించి రహదారి పనులు ప్రారంభిం చేలా చర్యలు తీసుకొవాలని పలువురు కొరుతున్నారు. కాగా నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తామని పీఆర్‌ జేఈ ఆనంద్‌ తెలిపారు.

Updated Date - Aug 16 , 2026 | 12:15 AM