నా భర్తను చంపేశారు..
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:30 AM
అన్నదమ్ముల కుటుం బాల మధ్య ఏర్పడిన చిన్నపాటి వివాదం.. చిలికి చిలికి గాలివాన గా మారింది. తోపులాటకు దారితీసింది.
పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు
రాజాం రూరల్, జూలై 6(ఆంధ్రజ్యోతి): అన్నదమ్ముల కుటుం బాల మధ్య ఏర్పడిన చిన్నపాటి వివాదం.. చిలికి చిలికి గాలివాన గా మారింది. తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నేలపై పడి తలకు రాయి తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కొండంపేటలో సోమవారం చోటుచే సుకుంది. తన భర్తను చంపేశారంటూ మృతుడి భార్య పలిశెట్టి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం టౌన్ సీఐ అశోక్‌కుమార్ కేసు నమోదు చేశారు. సీఐ అందించిన సమాచారం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని కొండంపేటకు చెంది న పలిశెట్టి శంకర్రావు(50) తన ఇంటి మరుగుదొడ్డి సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేయించేందుకు వాహనాన్ని తీసుకువచ్చారు. ఇదే సమయంలో శంకర్రావు సోదరు డు పలిశెట్టి మహేశ్, అతని భార్య పలిశెట్టి సునీత.. ట్యాంక్ శుభ్రం చేయడాన్ని అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై శంకర్రావు, అతని భార్య ధనలక్ష్మి ప్రశ్నించడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమం లో శంకర్రావును మహేశ్, సునీత.. కొట్టి, చేతులతో తోసివేశారు. దీంతో శంకర్రావు నేలపై పడిపోయాడు. ఈక్రమంలో తలకు రాయి తగిలి, తీవ్ర గాయాలపాలయ్యా డు. గాయాలపాలైన శంకర్రావును జీఎంఆర్ కేర్ ఆసుపత్రికికి తరలించారు. అప్ప టికే శంకర్రావు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. కొండంపేట గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నా యి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.