Share News

పదేళ్లుగా గాలికొదిలేశారు

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:15 AM

రామ స్వామిపేట గ్రామంలోని అంగన్‌వాడీ భవ న నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని సీఐటీయూ జిల్లా నాయ కుడు చల్లా జగన్‌ డిమాండ్‌ చేశారు.

పదేళ్లుగా గాలికొదిలేశారు

  • అందుబాటులోకి తీసుకురావాలి: సీఐటీయూ నేత జగన్‌

వేపాడ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రామ స్వామిపేట గ్రామంలోని అంగన్‌వాడీ భవ న నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని సీఐటీయూ జిల్లా నాయ కుడు చల్లా జగన్‌ డిమాండ్‌ చేశారు. ఆయ న శుక్రవారం రామస్వామిపేటను సందర్శిం చారు. ఈసందర్భంగా వృథాగా ఉన్న అంగన్‌వాడీ భవన నిర్మాణాన్ని పరిశీలిం చారు. ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభించి పదేళ్లు అయ్యిందని, రెండు ప్రభుత్వాలు మారి, మూడో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ అందుబాటులోకి రాకపో వడం దారుణమన్నారు. ఈ నిర్లక్ష్యానికి కార ణం ఎవరో జిల్లా అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి భవనం నిర్మాణం పూర్తి చేసి, చిన్నారులకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆయన కోరారు. లేని ఎడల ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టక తప్పదని ఆయన హెచ్చరించారు.

Updated Date - Mar 21 , 2026 | 12:15 AM