They dug it up and left it. తవ్వి వదిలేశారు
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:30 PM
They dug it up and left it. మక్కువ మండలం మేలాపువలస-కన్నంపేట వరకు గల రోడ్డును తవ్వి వదిలేశారు. రోజులు గడుస్తున్నా బీటీ రహదారి పనులు ప్రారంభించక పోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రహదారి నిర్మాణంలో జాప్యం
వాహనదారులు, ప్రజలకు తప్పని ఇక్కట్లు
మక్కువ, సెస్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం మేలాపువలస-కన్నంపేట వరకు గల రోడ్డును తవ్వి వదిలేశారు. రోజులు గడుస్తున్నా బీటీ రహదారి పనులు ప్రారంభించక పోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా మేలాపువలస కాలనీ నుంచి కన్నంపేట గ్రామం వరకు మూడు కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి రూ.కోటీ 50లక్షలు మంజూరయ్యాయి. ఆగస్టు మొదటివారంలో ఆర్‌అండ్‌బీ అధికారులు టెండరు ఖరారు చేసి పనులు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మేలాపువలస నుంచి కన్నంపేట వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర పాత రోడ్డును తవ్వి ఆ పెచ్చులను పక్కనే కుప్పలుగా పోసి వదిలేశారు. అయితే నెలరోజులు గడుస్తున్నా రహదారి నిర్మాణం చేపట్టలేదు. ప్రస్తుతం ఆ మార్గం గోతులమయంగా మారడంతో ప్రజలు , వాహనదారులు రాకపోకలు సాగించలేక పోతున్నారు. పాత రోడ్డును తవ్వి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. మొత్తంగా పనుల జాప్యం కారణంగా ఈ రూటులో ప్రయా ణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణం జాప్యంపై ఆర్‌అండ్‌బీ డీఈ జ్ఞానేశ్వరావును వివరణ కోరగా.. ‘మేలాపువలస-కన్నంపేట వరకు తారురోడ్డు నిర్మాణానికి నిధులు మంజూర య్యాయి. రెండు రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తాం. అని తెలిపారు.