They drank it full ఫుల్‌గా తాగేశారు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:35 PM
They drank it full నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని నెల్లిమర్ల ఐఎంఎల్ డిపో పరిధిలోని ఉమ్మడి విజయనగరం జిల్లాలో మద్యం విక్రయాలు విస్తృతంగా సాగాయి.
ఫుల్‌గా తాగేశారు
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్కరోజే రూ.7 కోట్ల 76 లక్షల ఆదాయం
విజయనగరం క్రైం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని నెల్లిమర్ల ఐఎంఎల్ డిపో పరిధిలోని ఉమ్మడి విజయనగరం జిల్లాలో మద్యం విక్రయాలు విస్తృతంగా సాగాయి. 192 మద్యం షాపులు, 22 బార్లు కలిపి రూ.7 కోట్ల 76 లక్షల 87 వేల 757 రూపాయల ఆదాయం లభించింది. గత ఏడాది కంటే దాదాపు రూ.2 కోట్ల 50 లక్షల ఆదాయం పెరిగింది. గత ఏడాది రూ.5 కోట్ల 27 లక్షల 68 వేల 277 రూపాయలు ఆదాయం వచ్చింది. మద్యం ప్రియులకు కావాల్సిన బ్రాండ్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో భారీ విక్రయాలు జరిగాయి. డిసెంబరు 31 మందుబాబులకు ప్రత్యేకం. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే సందర్భంలో ఏటా ఎక్కువ మంది మద్యం తాగుతుంటారు. వైన్‌షాపులు, బార్లును రెండు గంటల పాటు అదనంగా తెరిచి ఉంచారు. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటలకు షాపులు, బార్లు మూసేయాలి. డిసెంబరు31కి కాస్త వెసులుబాటు ఇచ్చారు. రాత్రి 12 వరకూ విక్రయాలు చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాత్రి 12 గంటల వరకూ బార్లు తెరిచి ఉన్నాయి. రాత్రి 8 గంటల వరకూ సాధారణ కొనుగోళ్లు జరిగినా రాత్రి 9 గంటల తరువాత బార్లలో విపరీతమైన రద్దీ కన్పించింది.
-------------