They came down like a festival పండగలా దిగివచ్చారు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:37 PM
They came down like a festival సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి శోభ జిల్లా అంతటా ఉట్టి పడు తోంది. పండగ కోసం వచ్చిన వారితో ఇళ్లు, వాకిళ్లు కళకళలా డుతుండగా మంగళవారం ఎ టు చూసినా జనమే కన్పించారు.
పండగలా దిగివచ్చారు
కిటకిటలాడిన బస్సులు, రైళ్లు, మార్కెట్‌లు
పల్లె వాకిట సంక్రాంతి సందడి
విజయనగరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):
సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి శోభ జిల్లా అంతటా ఉట్టి పడు తోంది. పండగ కోసం వచ్చిన వారితో ఇళ్లు, వాకిళ్లు కళకళలా డుతుండగా మంగళవారం ఎ టు చూసినా జనమే కన్పించారు. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి ప్రయా ణించారు. వచ్చిన వారంతా మార్కెట్‌లకు వెళ్లడంతో దుకాణాల్లో సైతం ఇసుకేస్తే రాలనంతగా జనం చేరారు. బుధవారం నాటి భోగితో మూడు రోజుల పండగ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే భోగి సందడి మొదలైంది. యువకులు పెద్ద ఎత్తున కర్రలు, చెక్కలు, పాత సామాన్లను సేకరించారు.
- భోగి ముందురోజు మంగళవారం విజయనగరం మార్కెట్ రద్దీగా మారింది. అడుగుతీసి అడుగువేయలేని స్థితి కనిపించింది. నిత్యావసరాలు, పండ్లు, పూజాసామగ్రి, స్టీల్ సామాన్లు, స్వీట్లు, పువ్వులు, కూరగాయలు, వస్త్రాల కొనుగోళ్లు భారీగా సాగాయి.
నేడు బోగభాగ్యాల ‘భోగి’
విజయనగరం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల సంక్రాంతిలో భాగంగా తొలిరోజు భోగి పండగను బుధవారం జిల్లా ప్రజలు జరుపుకో నున్నారు. యువత రాత్రంతా మేలుకుని భోగి మంటలు వేసేందుకు ఉత్సా హం చూపించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి విస్తృతంగా భోగి మంటలు వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో భోగి మంటకు సమీపంలో డీజేలు పెట్టారు. భోగి వేసే సందర్భంలో జాగ్రత్తలు పాటించాలని, ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని అగ్ని మాపక శాఖాధికారులు సూచించారు. ఇదిలా ఉండగా దాదాపు నెల రోజు ల పాటు మేలుకొలుపు నిర్వహించిన భక్త బృందాలు భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదాదేవి కల్యాణం చేస్తాయి. ఇంకోవైపు చిన్నారులు మొదలు పెద్దవారి వరకూ ఆవుపేడతో తయారుచేసిన పిడకలను మాలగా కూర్చి భోగీలో వేసేందుకు సిద్ధమయ్యారు. సూర్యాస్తమయంలోపు చిన్నారులకు పెద్ద ఎత్తున బుధవారం భోగిపండ్లు వేయనున్నారు.