Share News

గ్రామ‘కంఠం’ నొక్కేస్తున్నారు!

ABN , Publish Date - May 03 , 2026 | 12:09 AM

పేరాపురం పంచాయతీలో కొప్పెర్లకు వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఖాళీస్థలంపై కొందరు ఆక్రమణదారుల కన్ను పడింది. ముఖ్యంగా గ్రామకంఠాలు ఆక్రమణలకు గురవుతున్నాయి.

గ్రామ‘కంఠం’ నొక్కేస్తున్నారు!
కోనాడ ప్రధాన రహదారి పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణాలు

- ఇష్టారాజ్యంగా ఆక్రమణలు

పూసపాటిరేగ, మే 2(ఆంధ్రజ్యోతి): పేరాపురం పంచాయతీలో కొప్పెర్లకు వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఖాళీస్థలంపై కొందరు ఆక్రమణదారుల కన్ను పడింది. ముఖ్యంగా గ్రామకంఠాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం సెంటు రూ.4లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఆ స్థలాలను ఏలాగైనా ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న గోతిని కూడా కప్పి ఆక్రమణలకు తెరలేపారు. తొలుత పునాదులు వేసి...రేకుల షెడ్లు నిర్మిస్తూ ఆక్రమణలకు తెగబడుతున్నారు. స్థానిక నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో మరి కొంతమంది అదే బాట పడుతున్నారు. మురుగు కాలువలను కప్పేసి... నీరు ప్రవహించేందుకు కూడా వీలు లేకుండా చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి...ఈ ప్రాంతంలో అక్రమణలకు

పట్టించుకోవటంలేదు

అక్రమ నిర్మాణాలను..ఆక్రమణలను నిలిపివేయాలని ఆదేశిస్తున్నా... కొంతమంది పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ కార్యదర్శి అనితారాణి తెలిపారు. దీనిపై లిఖితపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఆమె చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు.

Updated Date - May 03 , 2026 | 12:09 AM