Share News

మళ్లీ వచ్చాయి

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:38 AM

మెరకముడిదాం మండలంలోకి ఏనుగులు మళ్లీ ప్రవేశించాయి.

 మళ్లీ వచ్చాయి

  • భయాందోళనలో రైతులు

మెరకముడిదాం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మెరకముడిదాం మండలంలోకి ఏనుగులు మళ్లీ ప్రవేశించాయి. గత కొద్ది రోజుల కిందట గొల్లవెంకయ్యపేట, బిల్లలవలస, ఉత్తరావల్లి గ్రామాల్లో సంచరిస్తూ పక్కన మండలం అయిన గరివిడి వైపు వెళ్లిపోయాయి. మళ్లీ శనివారం మండలంలో గల బుదరాయవలస, కొండలావేరు, బాడం గ్రామాల్లో సంచ రించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఎటువంటి నష్టం వాటిల్లిక ముందే అటవీ శాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 02 , 2026 | 12:38 AM