There will be no leniency if money is demanded for the pension. పింఛను కోసం డబ్బులడిగితే ఉపేక్షించేది లేదు
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:22 PM
There will be no leniency if money is demanded for the pension. ఎన్టీఆర్ పింఛను పంపిణీలోగానీ, మంజూరు కోసం గాని లబ్ధిదారులను డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి స్పష్టంచేశారు. పింఛన్ల ఫిర్యాదులు, స్పందనలపై గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
పింఛను కోసం డబ్బులడిగితే ఉపేక్షించేది లేదు
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
విజయనగరం టౌన్, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి):
ఎన్టీఆర్ పింఛను పంపిణీలోగానీ, మంజూరు కోసం గాని లబ్ధిదారులను డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి స్పష్టంచేశారు. పింఛన్ల ఫిర్యాదులు, స్పందనలపై గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జూలై నెలలో ఐవీఆర్‌ఎస్ క్యాంపెయిన్‌లో 626 సచివాలయాల నుంచి 21,206 స్పందనలు నమోదయ్యాయని తెలిపారు. మొదటిరోజు ఇంటివద్ద పింఛన్ అందుతున్నదీ లేనిదీ అన్న అంశంపై 88.49శాతం సానుకూల స్పందన లభించిందన్నారు. గత ఆరుమాసాలతో పోల్చిచూస్తే జూలైలో కొంత మెరుగైన నివేదిక వచ్చిందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించి పింఛను పంపిణీలో మంచి ఫలితాలు రాబట్టేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. పింఛను పంపిణీ సిబ్బంది లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. వారిపట్ల సానుకూలంగా వ్యవహరించి పింఛన్ అందజేయాలన్నారు.