డోలీ మోతలు ఉండకూడదు
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:12 AM
‘గ్రామాల్లో డోలీ మోతలు ఉండకూడదు. ప్రతి గ్రామానికీ అంబులెన్స్ వెళ్లాలి. అంబులెన్స్‌లు వెళ్లని గ్రామాలు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు.’ అని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.
- ప్రతి గ్రామానికీ అంబులెన్స్ వెళ్లాలి
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పాచిపెంట, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ‘గ్రామాల్లో డోలీ మోతలు ఉండకూడదు. ప్రతి గ్రామానికీ అంబులెన్స్ వెళ్లాలి. అంబులెన్స్‌లు వెళ్లని గ్రామాలు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు.’ అని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల రహదారుల నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వంద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. రహదారుల నిమిత్తం ప్రతిపాదనలు చేయాలని పలు సమావేశాల్లో తెలియజేసినా అధికారులు బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ గ్రామంలో ప్రతీ కుటుంబం వద్ద ఏఎన్‌ఎం నెంబరు ఉండాలని, సంచి వైద్యులు, బూత వైద్యుల దగ్గరికి రోగులు వెళితే వెంటనే సంబంధిత ఏఎన్‌ఎంను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పాచిపెంట పంచాయతీ దాసరివీధిలో సుమారు మూడు వందల అడుగుల కాలువ నిర్మించినా బిల్లు ఎందుకు చెల్లించలేదని, ఎప్పుడు నిర్మించారు? అనుమతి ఉందా? లేదా? విచారణ నిర్వహించి నివేదిక పంపించాలని ఎంపీడీవో బీవీజే పాత్రోకి ఆదేశించారు.
వినతులు వెల్లువ
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 120 అర్జీలు అందాయి. భూసమస్యలపై అధికంగా వినతులు వచ్చాయి. కొటికిపెంట నిర్వాసిత కాలనీలో నిధులు చాలక ఇళ్లు నిర్మించడం లేదని, నిధులు పెంచినట్లయితే నిర్వాసితులు ముందుకు వస్తారని ఆ గ్రామ సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.