Share News

ప్రజాఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్‌

ABN , Publish Date - May 05 , 2026 | 12:31 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రజాఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్‌
అర్జీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి

పార్వతీపురం, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, ఐటీడీఏ పీవో ఆర్‌.వైశాలి, డీఆర్‌వో కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్‌ దిలీప్‌ చక్రవర్తితో కలిసి ఆయన ప్రజల నుంచి 52 వినతులను స్వీకరించారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని, పార్వతీపురం మండలం లోని అడారు పాఠశాలలో టేకు చెట్లను అక్రమంగా నరికిన వారిపై చర్యలు తీసుకోవా లని ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అలాగే రెవెన్యూ క్లినిక్‌కు 20 వినతులు అందాయి.

Updated Date - May 05 , 2026 | 12:31 AM