Share News

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:59 PM

నియోజకవర్గ వ్యాప్తం గా ప్రజా దర్బార్‌లో వచ్చిన వినతుల పరిష్కారానికి అధికా రులు కాలయాపన చేయొద్దని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు.

సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

లక్కవరపుకోట, జూన్‌ 6(ఆం ధ్రజ్యోతి): నియోజకవర్గ వ్యాప్తం గా ప్రజా దర్బార్‌లో వచ్చిన వినతుల పరిష్కారానికి అధికా రులు కాలయాపన చేయొద్దని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. శనివారం ఆమె ఎల్‌.కోటలోని తన నివాసం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విశేషమైన స్పందన లభించింది. ప్రజల నుంచి 118 దరఖాస్తులు రాగా.. అందులో 112 పింఛన్లకు సంబంధించినవేనని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆమె ఎంపీడీవో కార్యాలయం వద్ద స్థానిక నాయకుల తో కలిసి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చొక్కా కుల మల్లునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వరరావు, మల్లా రామకృష్ణ, కల్లద్దాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:59 PM