Shortcomings లోటుపాట్లు ఉండరాదు
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:01 AM
There Must Be No Shortcomings ఎన్నికల సిబ్బంది సమర్థవంతంగా ఎన్నికల విధులు చేపట్టాలని, ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ రహర్ ఆదేశించారు. శుక్రవారం సాలూరు మున్సిపాల్టీలో పోలింగ్ ఏర్పాట్లును పరిశీలించారు.
సబ్ కలెక్టర్ సచిన్ రహర్
సాలూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సిబ్బంది సమర్థవంతంగా ఎన్నికల విధులు చేపట్టాలని, ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ రహర్ ఆదేశించారు. శుక్రవారం సాలూరు మున్సిపాల్టీలో పోలింగ్ ఏర్పాట్లును పరిశీలించారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌తోపాటు ఇతర అధికారులతో సమావేశ మయ్యారు. ఆదివారం జరిగే పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటర్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ తదితర విషయాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సజావుగా జరిగేలా చూడాలి: డీఎస్పీ
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, కొట్లాటలకు తావు లేకుండా విధులు నిర్వహించా లని పార్వతీపురం డీఎస్పీ శేషయ్య సిబ్బందిని ఆదేశించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 32 వార్డులకు గాను 62 పోలింగ్ స్టేషన్లలో ఎన్నిక ప్రక్రియ జరుగుతుందన్నారు. వాటి పరిశీలనకు ఆరు రూట్లులో పోలీసు ఉన్నతాధికారుల నిఘా ఉంటుందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని ఆయన కోరారు. సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
పాలకొండలో సబ్‌కలెక్టర్ పరిశీలన
పాలకొండ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రిసెప్షన్, డిస్ర్టిబ్యూటరీ సెంటర్లను సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్, కమిషనర్ రాజు పరిశీలించారు. నగర పంచాయతీలో 28 వార్డులను మూడు జోన్‌లుగా విభజించి ఐదు రూట్లు ద్వారా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కమిషనర్ తెలిపారు. 30 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేశామని సబ్‌కలెక్టర్‌కు తెలిపారు. 30 మంది పీవోలు, మరో 30 మంది ఏపీవోలతో పాటు 120 మంది ఓపీవోలను నియమించామన్నారు. నవంబర్ 1న ఉదయం ఆరు గంటలకు మాక్ పోలింగ్, ఏడు గంటల నుంచి రెగ్యులర్ పోలింగ్ ప్రారంభిస్తామన్నారు. 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీచోటా వైద్య సేవలతో పాటు ప్రత్యేక ఎన్నికల సహాయ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్లు కోసం వీల్‌చైర్లు సిద్ధం చేయడంతో పాటు ర్యాప్ సౌకర్యం అందుబాటులో ఉంచామన్నారు.
నగర పంచాయతీలో పోలీస్ కవాతు
పాలకొండలో డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. సుమారు 150 మందితో ప్రత్యేక పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సీసీ కెమేరాలు, డ్రోన్లతో నిఘా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.