రైతుల భూములు తీసుకుంటే ఊరుకునేది లేదు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:53 PM
మండలంలోని రైతుల భూములను స్టీల్‌ప్లాం ట్ నిర్మాణం కోసం అక్రమంగా తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ
గుర్ల, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతుల భూములను స్టీల్‌ప్లాం ట్ నిర్మాణం కోసం అక్రమంగా తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన బెల్లానపేట గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయడం మంచిది కాదన్నారు. ఇక్కడ ఎక్కువగా అటవీ భూములు ఉన్నాయని వాటికి దగ్గరలో ఇలాంటి ఫ్యాక్టరీలు నిర్మించడానికి చట్టం ఒప్పుకోదన్నారు. ఒకవేళ అలాంటి కార్యక్రమాలు చేస్తే రాజ్యాంగపరంగా రైతుల తరపున కోర్టును ఆశ్రయించి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చీపురుపల్లి కన్వీనర్ శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు రమేష్‌రాజు, ఆదాడ మోహనరావు, ఐదు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యు లు పాల్గొన్నారు.