భూములు వదులుకునేది లేదు
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:07 AM
ప్రైవేటు హోటల్ రహదారి కోసం తమ భూము లను వదులుకునేది లేదని దిబ్బలపాలెం గ్రామా నికి చెందిన రైతులు తెగించిచెప్పారు.
దిబ్బలపాలెం రైతుల ఆందోళన
భోగాపురం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు హోటల్ రహదారి కోసం తమ భూము లను వదులుకునేది లేదని దిబ్బలపాలెం గ్రామా నికి చెందిన రైతులు తెగించిచెప్పారు. ఈ మేరకు మంగళవారం వారు తమ గ్రామంలో నిరసన చేపట్టారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు కోసం భూము లు తీసుకున్నారని, ఉన్న కొద్దిపాటి భూములే జీవనాధారంగా బతుకుతున్నామని, ఇప్పుడు ఈ భూములు కూడా ప్రైవేటు హోటల్ రహదారి కోసం తీసుకుంటే.. ఇక ఊరు విడిచి వెళ్లి పోవా ల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.