రోడ్లు లేవు.. కాలువలు నిర్మించలేదు
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:40 PM
మండలంలోని ఎం.బూర్జివలసలో పీఎంఏవై ఎన్టీఆర్‌కాలనీలో వసతులు కొరవడ్డాయి. ప్రభుత్వం పేదల కోసం నిర్మిం చిన కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నివాసముంటున్న వారు ఇబ్బందిపడుతున్నారు.
బొబ్బిలి రూరల్, జూలై 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎం.బూర్జివలసలో పీఎంఏవై ఎన్టీఆర్‌కాలనీలో వసతులు కొరవడ్డాయి. ప్రభుత్వం పేదల కోసం నిర్మిం చిన కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నివాసముంటున్న వారు ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడ 50 ఇళ్లు మంజూరుకాగా 20 మంది నిర్మించుకొని నివ సిస్తున్నారు. కాలనీలో సరైన రోడ్లులేకపోవడంతోపాటు మురుగు కాలువలు నిర్మించక పోవడంతో వర్షాకాలంలో అవస్థలుపడుతున్నామని నివాసిస్తున్న వారు వాపోతున్నా రు. కాలనీలో పిచ్చిమొక్కలు, తుప్పలు పెరగడంతో విషపురుగులు సంచరిస్తున్నాయి. దీనికితోడు ఇళ్ల మధ్య ఉన్న దారులు పూర్తిగా మొక్కలతో కప్పుకుపోవడంతో ప్రజలు భయాందోళనచెందుతున్నారు. కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరు కాగానే కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హౌసింగ్ డీఈ ఆర్.వేణు తెలిపారు.