బస్సులు లేవు.. సేవలందవు
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:16 AM
గజ పతినగరం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతా లకు ఆర్టీసీ పల్లెవెలుగుల సేవలు అందని పరిస్థితి నెలకొంది. బస్సులు లేకపోవడంతో సాధారణ ప్రయాణికులపై భారం తప్పడంలేదు. గమ్యస్థానా లకు చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలను ఆశ్ర యించి అదనంగా చెల్లించాల్సివస్తోంది.
గజపతినగరం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గజ పతినగరం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతా లకు ఆర్టీసీ పల్లెవెలుగుల సేవలు అందని పరిస్థితి నెలకొంది. బస్సులు లేకపోవడంతో సాధారణ ప్రయాణికులపై భారం తప్పడంలేదు. గమ్యస్థానా లకు చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలను ఆశ్ర యించి అదనంగా చెల్లించాల్సివస్తోంది. నియోజక వర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేకపో వడంతో స్ర్తీశక్తి పఽథకం కింద కల్పించిన సేవలకు మహిళలు దూరమవుతున్నారు.గజపతినగరం, దత్తి రాజేరు, బొండపల్లి మండలకేంద్రాలకు చేరుకోవడా నికి గ్రామాలనుంచి ఆటోలను ఆశ్రయించా ల్సివస్తోంది. రోడ్లు బాగోలేవని, ఆర్థికంగా సంస్థకు గిట్టుబాటు కావడంలేదని తదితర కారణాల్లో గతంలో నడిచే బస్సులను గ్రామీణ రూట్‌లో నిలిపి వేశారు. గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి మండలాల్లో జనాభా తక్కువ ఉన్న రోజుల్లో ఆర్టీసీ సర్వీసులు ఎక్కువగా ఉండేవి.ప్రస్తుతం జనాభా పెరిగినా మూడొంతుల గ్రామాలకు బస్‌లు రద్దు చేయఙడంతో ప్రయాణికులు అగచాట్లకు గురవుతు న్నారు. గజపతినగరం మండలంలోని గతంలో ముచ్చర్ల, కెంగువగ్రామాలకు ఆర్టీసీసర్వీసులు ఉం డేవి. ప్రస్తుతం ఆయా సర్వీసులులేక విద్యార్థులు, వ్యాపారులు ఇక్కట్లకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎం.కొత్త వలస గ్రామానికి బస్‌సౌకర్యం కల్పించే దిశగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చర్యలుచేపట్టారు. అధి కారులు ట్రైల్‌వేసినా ఇంతవరకు బస్ నడవ డంలేదు. దత్తిరాజేరు మండలంలోని పెదకాదకు గతంలో బస్‌సర్వీస్ నడిచేది. గజపతినగరం మం డలంతో పాటుదత్తిరా జేరుమండలాలను కలుపు కొంటు ప్రయాణికుల రాకపోకలుజరిగేవి. అలాగే చినకాద, గడసాం గ్రామాల మీదుగా ప్రైవేటు సర్వీసులు నడిచేవి. ఆటోలు పెర గడంతో తర్వాత ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. అలాగే బొం డపల్లి మండలానికి సంబందించి గొల్లుపాలెం మీదుగా బుడతనాపల్లి రాజేరు, బిల్లలవలస మీదు గా విజయనగరం, దేవుపల్లి మీదుగా విజయనగ రం ఆర్టీసీ సర్వీసులు నడిచేవి. వివిద కారణాల వల్ల నిలిచిపోయిన బస్సుల రాకపోకలు పున రుద్ధరించాలని పలువురు కోరుతున్నారు.