Their ‘Game’ Came to an End.. వారి ‘ఆట’ సాగలే..
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:22 AM
Their ‘Game’ Came to an End.. వారంతా వివిధ మండలాలకు చెందిన వారు. తరచూ జియ్యమ్మవలస మండలంలోనే ఓ చోట కలుసుకుని పేకాడుతుంటారు. అంతకు ముందు ఫోన్లలోనే చర్చించుకుంటారు. అనుకున్న చోట.. అనుకున్న సమయానికి కార్లులో వచ్చి.. పెద్దఎత్తున పేకాట శిబిరం నిర్వహిస్తుంటారు. అయితే ఈ సారి వారి ఆట సాగలేదు. పోలీసుల మెరుపుదాడితో అడ్డంగా బుక్కయ్యారు. వి
16 మందిపై కేసు నమోదు
రూ. 3.04 లక్షలు, రెండు కార్లు, 16 సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం
జియ్యమ్మవలస, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): వారంతా వివిధ మండలాలకు చెందిన వారు. తరచూ జియ్యమ్మవలస మండలంలోనే ఓ చోట కలుసుకుని పేకాడుతుంటారు. అంతకు ముందు ఫోన్లలోనే చర్చించుకుంటారు. అనుకున్న చోట.. అనుకున్న సమయానికి కార్లులో వచ్చి.. పెద్దఎత్తున పేకాట శిబిరం నిర్వహిస్తుంటారు. అయితే ఈ సారి వారి ఆట సాగలేదు. పోలీసుల మెరుపుదాడితో అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. తురకనాయుడువలస, చినకుదమ గ్రామాల మధ్య నాగావళి నది ఎడమ కాలువ గట్టుపై పక్కన ప్రాంతంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది. ఈ మేరకు జియ్యమ్మవలస, చినమేరంగి పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు ఎన్.ప్రశాంత్‌కుమార్, ఎ.నీలకంఠరావుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పోలీసు సిబ్బంది దాడి చేశారు. ఏపీ 91 గేమింగ్ యాక్ట్ కింద 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 3 లక్షల నగదు, 16 సెల్ ఫోన్లు, రెండు కార్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారందరూ బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, కొమరాడ మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. ఆ 16 మందిపై కేసు నమోదు చేశారు. కాగా ఇద్దరు ఎస్‌ఐలు, తొమ్మిది మంది సిబ్బందికి సీఐ టీవీ తిరుపతిరావు అభినందనలు తెలియజేశారు.