Share News

విద్యుత్‌ తీగల చోరీ

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:22 AM

విద్యుత్‌తీగలు చోరీ చేసిన వ్యక్తులను ఎస్‌.కోట పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

విద్యుత్‌ తీగల చోరీ

  • ఇద్దరికి రిమాండ్‌

శృంగవరపుకోట, మార్చి 8(ఆంధ్ర జ్యోతి): విద్యుత్‌తీగలు చోరీ చేసిన వ్యక్తులను ఎస్‌.కోట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఫిబ్రవరి 22న నవోదయ పాఠశాల పక్కన ఉన్న లేఅవుట్‌లో విద్యుత్‌ వైర్లు పో యాయని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ వి.నా రాయణ మూర్తి తెలిపారు. స్థానికం గా నివశిస్తున్న పాత నేరస్తుడు ఎం.సుధాకర్‌ రెడ్డి, అల్లూరి సీతారా మరాజు జిల్లా అనంతగిరి మండలం వెంగాడ గ్రామానికి చెందిన గోమంగి మహేష్‌ బాబుతో పాటు మరో ఇద్దరు జూవినైల్స్‌ (బాల నేరస్తులు)లను వెంకటరమణపేట గ్రామం వద్ద ఎస్‌ఐ చంద్ర శేఖర్‌ సిబ్బందితో ఆదివారం అదుపులోకి తీసుకున్నారన్నారు. 85 కిలోల విద్యుత్‌ వైర్లు, రెండు కట్టర్‌లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

Updated Date - Mar 09 , 2026 | 12:22 AM