30 తులాల బంగారు ఆభరణాల చోరీ
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:09 AM
మండల కేంద్రంలో కిరాణా వ్యాపారం చేస్తున్న వక్కలగడ్డ సురేష్ ఇంట్లో చోరీ జరిగింది.
సీతానగరం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కిరాణా వ్యాపారం చేస్తున్న వక్కలగడ్డ సురేష్ ఇంట్లో చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని సోమవారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార నిమిత్తం డబ్బులు అవసరమై బీరువా తెరవడంతో అందులో బంగారు భరణాలు అపహరణకు గురైనట్టు ఆయన గుర్తించారు. సురేష్ కుటుంబంతో పాటు సీతానగరంలోనే నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న సీఐ రంగనాఽథం, ఎస్‌ఐ హేమలత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి బజారు సెంటర్‌లో కూర్మదాసు కిశోర్ ఇంట్లో సుమారు 15 తులాల బంగారం చోరీకి గురైంది. ఆ ఘటన మరవక ముందే సోమవారం అదే ప్రాంతంలో మరో చోరీ వెలుగులోకి వచ్చింది.