Share News

తెర్లాంలో చోరీ

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:21 AM

తెర్లాంలోని ఓ ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది.

తెర్లాంలో చోరీ

తెర్లాం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): తెర్లాంలోని ఓ ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. రూ.50వేలు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెర్లాం గ్రామానికి చెందిన వ్యాపారి కందుల పైడిరాజు ఈనెల 25న తన బంధువుల ఇంటిలో శుభకార్యానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. తిరిగి ఈనెల 26న సాయంత్రం ఇంటికి వచ్చారు. ఇంట్లో బీరువా తాళం పగలగొట్టి ఉంది. ఇందులో రూ.50వేలు అపహరణకు గురైనట్టు గుర్తించారు. దొంగలు ఇంటి వెనుక వైపు కిటికిలో నుంచి ఇంట్లోకి చొరబడినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్‌ఐ సాగర్‌బాబు క్లూస్‌ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 28 , 2026 | 12:22 AM