సమాజంలో మార్పులకు యువతే కీలకం
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:12 AM
సమాజంలో మంచి మార్పు తీసుకు రావడంలో యువతదే కీలక పాత్ర అని విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు.
ఎస్పీ దామోదర్
గజపతినగరం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): సమా జంలో మంచి మార్పు తీసుకు రావడంలో యువతదే కీలక పాత్ర అని విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ‘యువ చైతన్యం’ కార్యక్రమం నిర్వహించి, యువత బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతే సారఽథులుగా గ్రామా ల్లో దురలవాట్లను రూపుమాపేందుకు ‘యువ చైత న్యం’ కార్యక్రమం రూపొందించినట్టు చెప్పారు. గంజా యి వంటి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్నారు. గంజాయి విక్రయిస్తూ చిక్కిన వారిపై హిస్టరీ షీట్లను తెరచి.. నిఘా ఉంచుతామన్నారు.
మహిళలను వేధిస్తే అంతే..
బాలికలు, మహిళలపై ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందిం చవద్దని సూచించారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడితే తక్షణమే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలన్నా రు. మహిళలు తమ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పోలీసుల సాయం పొందాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని యువతతో ప్రతిజ్జ చేయించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో నూతనంగా నిర్మాణం చేపట్టిన విశ్రాంతి గదిని ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ సన్యాసినాయు డు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ లీలారావు, ఎస్‌ఐ కిరణ్ కుమార్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.