అమరావతి పేరు ఎత్తే అర్హత వైసీపీకి లేదు
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:16 AM
అమరావతి రాజధాని పేరు తలిచే అర్హత వైసీపీ ఏనాడో కోల్పో యిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్
గజపతినగరం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని పేరు తలిచే అర్హత వైసీపీ ఏనాడో కోల్పో యిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆది వారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆయన చిన్నారులకు పోలి యో చుక్కలు వేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో విజన్-2047 లక్ష్యంతో ముందుకు సాగుతు న్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే వైసీపీ నాయకులు పనిగా పెట్టు కున్నారని ఆరోపించారు. రాజధాని అమరాతిలో రైతులపై కవ్వింపు చర్యలు చేపట్టే విధంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉండవల్లి ప్రాంతంలో ఇసుమంత కూడా అభివృద్ధి చేయని వైసీపీ నాయకుల కు ఆ ప్రాంతంలో తిరిగే హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో శరవేగంగా జరు గుతున్న రాజదాని అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ మావిగన్ అంటూ మరో నాటకానికి తెరలేపారన్నారు. లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి నాంది పలుకుతున్న లోకేశ్‌పై మాట్లా డే అర్హత గొడ్డలి పార్టీకి లేదన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవడానికే వైసీపీ కుట్రలు: ఎంపీ కలిశెట్టి
రాజాం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావే శంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధానిని దేశంలోనే ఒక మోడల్‌గా నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే జగన్మోహన్‌రెడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బెంగుళూరు ప్యాలస్‌లో ఉండి మాజీ మంత్రులను శనివారం అమరావతికి పంపించి విధ్వంసం సృష్టించారన్నారు.