Share News

సిరిమానోత్సవంలోగా పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:06 AM

పైడిమాంబ సిరిమానోత్స వానికి ముందుగానే పనులను పూర్తి చేయాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అధికారులకు సూచించారు. పైడిమాంబ జాతర మహోత్సవాలు ఖరారుకావడంతో ఎమ్మెల్యే బుధవారం పైడిమాంబ ఆలయంలో విస్తరణ పనుల్లో భాగంగా కొన్ని పెండింగ్‌ పనులను పరిశీలించారు.

 సిరిమానోత్సవంలోగా పనులు పూర్తి చేయాలి

విజయనగరం కల్చరల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్స వానికి ముందుగానే పనులను పూర్తి చేయాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అధికారులకు సూచించారు. పైడిమాంబ జాతర మహోత్సవాలు ఖరారుకావడంతో ఎమ్మెల్యే బుధవారం పైడిమాంబ ఆలయంలో విస్తరణ పనుల్లో భాగంగా కొన్ని పెండింగ్‌ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విస్తరణలో భాగంగా అమ్మవారి ఆలయం పక్కన ఉన్న లక్ష్మీ హోటల్‌ కూడా తొలగించి ఆలయ ప్రాంగణంగా విస్తరించనున్నట్లు తెలిపారు.అన్నదాన, కార్యాలయ భవనం పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ శీరిష పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:06 AM