Share News

వైసీపీ నాయకుల మాటలకు అర్థాలే వేరు

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:10 AM

వైసీపీ నాయకులు మాటలకు అర్థాలే వేరుగా ఉంటా యని, రాజకీయ స్వార్థంతో ఎప్పటికప్పుడు మాటలు మార్చుతుంటారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు.

వైసీపీ నాయకుల మాటలకు అర్థాలే వేరు

విజయనగరం రూరల్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు మాటలకు అర్థాలే వేరుగా ఉంటా యని, రాజకీయ స్వార్థంతో ఎప్పటికప్పుడు మాటలు మార్చుతుంటారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. వారు ఆదివా రం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడా రు. వైఎస్‌ మరణానంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతా ల్లో పర్యటించిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసా ద్‌రావులు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారన్నారు. ఒకనొక దశలో వైఎస్‌ ప్రయాణించిన హెలికాఫ్టర్‌ అదృశ్యం వెనుక కూడా జగన్‌ హస్తం ఉందోమోనని అనుమానాలు వ్యక్తం చేసిన ఈ నేతలు ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి పంచన చేరి ఇప్పుడు జగన్‌కి అనుకూలంగా మాట్లాడుతున్నా రన్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్‌రావులు చేసిన వ్యాఖ్యలకు సంబంధిం చిన వీడియోలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. వీటిని అవగాహన చేసుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ, తమ ప్రాంతాలకు వెళ్లి, దీని గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వారు పిలుపునిచ్చా రు. అప్పటి న్యూస్‌పేపర్లలో వచ్చిన కథనాలను ఫ్లెక్సీ రూపంగా ఏర్పాటు చేసి ప్రదర్శించారు. వీటిని నగర పరిధిలోని పలు డివిజన్ల యూనిట్‌ ఇన్‌చార్జులు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ గ్రామాల యూనిట్‌ ఇన్‌చా ర్జిలు, గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు ఈ ఫ్లేక్సీలను, వీడి యోలను ఆసక్తిగా తిలకించారు.

Updated Date - Apr 13 , 2026 | 12:10 AM