Share News

వైసీపీ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:56 PM

భోగాపురంలో నిర్మితమవుతున్న అల్లూరు సీతారామరాజు జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు విషయంలో వైసీపీ నాయకులు మాట్లాడే తీరు చాలా విడ్డూరంగా ఉందని టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు అన్నారు.

వైసీపీ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయి

డెంకాడ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో నిర్మితమవుతున్న అల్లూరు సీతారామరాజు జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు విషయంలో వైసీపీ నాయకులు మాట్లాడే తీరు చాలా విడ్డూరంగా ఉందని టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు అన్నారు. పెదతాడివాడ గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె భాస్కరరావు, విజయనగరం పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పాణిరాజుతో కలిసి ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ఆనాడు రైతులను, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వైసీపీ నాయకులు.. ప్రస్తు తం తమ గొప్ప కోసం విమానాశ్రయాన్ని వాడుకోవడం చూస్తే జాలేస్తుందన్నా రు. విమానాశ్రయం అభివృద్ధిని వైసీపీ నాయకులు తమ ఖాతాలో వేసుకునేందు కు అత్యుత్సాహం చూపిస్తున్నారని విమర్శించారు.

Updated Date - Jan 06 , 2026 | 11:56 PM