కార్మికుల శ్రేయస్సే లక్ష్యం
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:08 AM
ఆర్టీసీ కార్మికుల సంక్షే మం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణే నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) ప్రధాన లక్ష్యమని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ రమణారెడ్డి స్పష్టం చేశారు.
ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుల సంక్షే మం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణే నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ) ప్రధాన లక్ష్యమని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ రమణారెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఏపీ ఎన్జీవో హోంలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం-మన్యం జిల్లాల ఎన్‌ఎంయూ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడు తూ, ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం అన్ని యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడి సమర్థవంతంగా పోరాడామని తెలిపారు. ఈ ఫలితంగా నష్టాల పేరుతో మూతపడిన డిపోలను పునఃప్రారంభించడంతో పాటు మరో 8 డిపోలు మూతప డకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి కాపాడుకునే ఘనత ఎన్‌ఎంయూకే దక్కుతుంద న్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండు డీఏలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌తో పాటు ఇతర ఆర్థిక బకాయిల సాధనకు రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామన్నారు. సీసీఎస్ పాలక మండలిని ఎన్‌ఎంయూ కైవసం చేసుకు న్న తర్వాత ఉద్యోగులకు అనేక వెసులుబాట్లు కల్పించామన్నారు. రాబోయే డిసెం బరు నెలలో జరగనున్న సీసీఎస్ ఎన్నికల్లో ఎన్‌ఎంయూకు మద్దతు తెలిపే అభ్య ర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూ ప్రతినిధులు టీవీ మోహన్, ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.