ప్రజల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:16 AM
కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని దశలవారీగా అమలు చేస్తోందని పార్వతీ పురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. సీఎం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు.
సీతానగరం(బలిజిపేట),జూన్20(ఆంఽధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని దశలవారీగా అమలు చేస్తోందని పార్వతీ పురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. సీఎం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు.శనివారం బలిజిపేట మండలంలోని పలగరలో 2026-27 అన్నదాత సుఖీభవ మొదటివిడత నిధుల పంపిణీ కార్య క్రమం నిర్వహించారు. తొలుత సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలఅభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బూరాడ రామ్మోహనరావు పాల్గొన్నారు.
చెరువుల సుందరీకరణకు కార్యాచరణ
పార్వతీపురంటౌన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలో ఉన్న నాలుగు చెరువుల సుందరీకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం మునిసిపాలిటీలోని 25వ వార్డులోగల చిన్న చెరువులో స్వచ్ఛంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ అభివృద్ధికి సహకరిస్తా
పార్వతీపురం రూరల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్సిపురం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్లాబ్ పనులను ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు.