రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:54 PM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు.
రాజాం ఎమ్మెల్యే కోండ్రు
రాజాం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. మంగళవారం దోసరి గ్రామంలో ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాం మండలంలో 15 గ్రామాలకు రీసర్వే చేసి.. 6,284 పట్టా దారు పాసుపుస్తకాలు, రేగిడి మండలంలో 7 గ్రామాల కు గాను 2,572, వంగర మండలంలో 17 గ్రామాలకు గాను 1332, సంతకవిటి మండలంలో 14 గ్రామాలకు గాను 1500 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసి నట్టు తెలిపారు. తహసీల్దార్ డి.రాజశేఖర్, డీటీ శివకు మార్, ఎంపీడీవో జె.ఆనందరావు, డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, నాయకులు కిమిడి అశోక్‌కుమార్, పిన్నింటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.