Share News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:29 AM

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు.

 రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

  • గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

పార్వతీపురం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. సోమవారం పార్వతీపురం కలెక్టర్‌ కార్యాలయంలో రైతు ఉత్పత్తి సంఘాల లబ్ధిదారులకు ట్రాక్టర్లను మంత్రితోపాటు విప్‌ జగ దీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పంపిణీ చేపట్టారు. అనంతరం ఆర్‌డీఏపీడీ ప్రభావతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఒక్కొక్కదానికి 15 లక్షలు చొప్పున నిధులు మంజూరుచేశామన్నారు. ఈ నిధులతో కొనుగో లు చేసిన ట్రాక్టర్లు ఆధునిక వ్యవసాయ పనిముట్లు అని, ఏ ఒక్క వ్యక్తి గత లబ్ధిదారునికి పరిమితం చేయకుండా వందలాది మంది సభ్యులుగా ఉన్న రైతులకు తక్కువ అద్దెకు అందుబాటులో ఉండేలా ట్రాక్టర్లు అంది స్తున్నామన్నారు. విప్‌ జగదీశ్వరి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యన్నారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రైతులు సద్వినియోగంచేసుకోవాలన్నారు. ఎమ్మె ల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ లక్షలాది రూపాయలతో ట్రాక్టర్ల ను కొనుగోలుచేసి అందిస్తున్న ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వైశాలి, ఆర్డీవో మాధురి. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:29 AM