రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:15 AM
రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృ షి చేస్తున్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అ న్నారు.
‘పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ’ పంపిణీ
పాల్గొన్న ప్రజాప్రతినిధులు
విజయనగరం రూరల్, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృ షి చేస్తున్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అ న్నారు. పీఎం కిసాన్, అన్నదాతా సుఖీభవ నిధులు వి డుదల సందర్భంగా జొన్నవలసలో ఎంపీటీసీ పి.రాజేష్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విజయనగరం మండ లంలోని 4,605 మంది లబ్ధిదారులకు రూ.2కోట్ల 95ల క్షలు విడుదలయ్యాయన్నారు. కౌలు కార్డులు, ఎరువుల కార్డులు, వరి విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రోతు నర్సింగరావు, పీవీ నర్సింహరాజు, రాజేష్‌వర్మ, రాకోడు ఎంపీటీసీ వేచలపు శ్రీనివాస్, టీడీపీ నాయకు లు బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, పాసి అప్పలనాయుడు, ఏవో కె.మహారాజన్, ఎంపీడీవో గంటా వెంకటరావు పాల్గొన్నారు.
గరివిడి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభు త్వం పని చేస్తోందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం గరివిడిలోని ఒక ప్రైవే టు ఫంక్షన్ హాల్‌లో అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని రైతులకు రూ.23కోట్ల 91లక్షలు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి రామ్‌మల్లిక్‌నాయుడు, వ్యవసాయ శాఖాధికారులు, నాలుగు మండలాల కూటమి నాయకులు పాల్గొన్నారు.