‘పాడిరైతుల సంక్షేమమే ధ్యేయం’
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:02 AM
పాడి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిల్‌నాయుడు అన్నారు.
మెరకముడిదాం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పాడి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిల్‌నాయుడు అన్నారు. గురువారం భైరిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామ్‌మల్లిక్‌నాయుడు సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తాడ్డి సన్యాసిరావు, టీడీపీ నాయకులు పి.సన్యాసిరావు, సర్పంచ్ గర్భాపు గాబ్రియేలు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.దామోదరరావు, డీఎల్డీఏ జి.రాధాకృష్ణ, ఏడీ సుబ్రహ్మణ్యం, పశువైద్యాధికారి హైమావతి, తదితరులు పాల్గొన్నారు.