Share News

రైతుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:26 AM

రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చీపురు పల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.

 రైతుల సంక్షేమమే ధ్యేయం

గుర్ల, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చీపురు పల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మండలంలోని గరిక వలస, చింతలపేట గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి రైతుల తో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. టీడీపీ నాయకులు త్రిమూర్తులు రాజు, కిరణ్‌కుమార్‌ రాజు, సీహెచ్‌ మ హేశ్వరరావు, కిల్లా అప్పలనాయుడు, కిలారి సూర్యనా రాయణ, కనిమెరక కృష్ణ, తహసీల్దార్‌ ఆదిలక్ష్మి, ఎంపీడీ వో రవికుమార్‌, ఏవో తిరుపతిరావు పాల్గొన్నారు.

రాజాం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. శ్యాంపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్ర మంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఈ కార్యక్ర మంలో పార్టీ నాయకులు గురవాన నారాయణరావు, కోటగిరి నారాయణరావు, ప్రజాప్రతి నిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:26 AM