గోడలు బీటలు వారి..ఇనుప ఊచలు తుప్పుపట్టి
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:58 PM
మండలంలోని చిత్రకోట బొడ్డ వలస గ్రామ శివారులో ఉన్న వెంగళరాయసాగర్ ప్రధాన కాలువపై నిర్మించిన కల్వర్టు శిథిలావస్థకు చేరింది.15 ఏళ్ల కిందట నిర్మించిన కల్వర్టు కనీస మ రమ్మతులకు నోచుకోకపోవడం, నిర్వ హణ లేకపోవడంతో ప్రధానంగా గోడలు బీటలువారాయి.
బొబ్బిలి రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిత్రకోట బొడ్డ వలస గ్రామ శివారులో ఉన్న వెంగళరాయసాగర్ ప్రధాన కాలువపై నిర్మించిన కల్వర్టు శిథిలావస్థకు చేరింది.15 ఏళ్ల కిందట నిర్మించిన కల్వర్టు కనీస మ రమ్మతులకు నోచుకోకపోవడం, నిర్వ హణ లేకపోవడంతో ప్రధానంగా గోడలు బీటలువారాయి. కింద భాగంలో శ్లాబు ఇనుప ఊచలు తుప్పుపట్టాయి. దీంతో ఏ క్షణంలోనైనా శ్లాబు కూలిపోతోందనన్న భయాందోళన నెలకొంది.ఈ వంతెన మీదుగా వెలగవలస, సీహెచ్ బొడ్డవలస, నిమ్మలపాడు, తదితర గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. చుట్టుపక్కల రైతులు తమ పొలాలకు కల్వ ర్టు మీదుగా వచ్చిపోతున్నారు. పంటఉత్పత్తులు కల్లాలకు కల్వర్టు మీదుగా తర లిస్తున్నారు. అలాగే ఇక్కడి వెంగళరాయసాగర్ ప్రధాన కాలువ గుండా దిబ్బ గుడ్డివలస, గోపాలరాయుడుపేట, పాతబొబ్బిలి, సీతానగరం మండలంలోని పలుగ్రామాలకు సాగునీరందుతోంది. కల్వర్టు కూలిపోతే ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయని పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. అలాగే ఆయకట్టుకు నీరందే అవకాశ ముండదని రైతులు వాపోతున్నా రు.తక్షణమే జలవనరుల శాఖ అధికారులు స్పందించి ఇక్కడ నూతన కల్వర్టు నిర్మించాలని రైతులు, వాహన చోదకులు కోరుతున్నారు. కాగా చిత్రకోట బొడ్డ వలస వద్ద కల్వర్టు శిథిలావస్థకు చేరడంతో కొత్తగా నిర్మాణానికి ప్రతిపా దనలు పంపించామని జలవనరులలశాఖ ఏఈ సుధీర్ తెలిపారు.