విజయోత్సవ సభను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:59 PM
కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపధ్యంలో సోమవారం విజయనగరంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో జరిగే విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు.
విజయనగరం కలెక్టరు రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపధ్యంలో సోమవారం విజయనగరంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో జరిగే విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఆదివారంరాత్రి పోలీస్ గ్రౌండ్‌లో చేపట్టి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలోని ఏఎస్‌పీ సౌమ్యలత, డీఆర్‌వో సత్తిబాబు, ఆర్డీవో సుధాసాగర్, సీపీవో బాలాజీలు పాల్గొన్నారు.
విజయనగరం రూరల్, జూన్ 14 ( ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వ ర్యంలో రెండేళ్ల విజయోత్సవసభ నిర్వహించనున్నారు.కార్యక్రమానికి పార్టీ నాయ కులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.