Share News

డ్రోన్ల ఉపయోగాలను తెలియజేయాలి

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:08 AM

క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన వారు విజ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరిచి డ్రోన్ల ఉపయోగాలను తెలియపరచాలని ఉల్లిభద్ర లోని ఉద్యాన కళాశాల అసోసియేషన్‌ డీన్‌ డాక్టర్‌ ఆర్‌.రాజ్యలక్ష్మి తెలిపారు.

 డ్రోన్ల ఉపయోగాలను తెలియజేయాలి
డోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తున్న నిర్వాహకులు:

గరుగుబిల్లి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన వారు విజ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరిచి డ్రోన్ల ఉపయోగాలను తెలియపరచాలని ఉల్లిభద్ర లోని ఉద్యాన కళాశాల అసోసియేషన్‌ డీన్‌ డాక్టర్‌ ఆర్‌.రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన కళాశాల విద్యార్థులకు డ్రోన్ల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఐసీఏఆర్‌ కార్యక్రమానికి సంబంధించి జూన్‌ 29వ తేదీ నుంచి బీఎస్‌సీ ఉద్యానవనానికి సంబంధించి 2, 3వ సంవత్సరాల్లో విద్యనభ్యసిస్తున్న 45 మందికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు డ్రోన్ల నిర్వహణపై అవగాహన కల్పించి నూతన విధానాలతో పంటలు పండించేలా పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:08 AM