ట్రక్‌షీట్లు సక్రమంగా పొందుపరచాలి
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:58 PM
ట్రక్‌షీట్లు సక్రమంగా పొందుప రచాలని జేసీ సేతుమాధవన్ కోరారు.శనివారం మండలంలోని ముగడ, కోడూరు గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీచేశారు. అనంతరం బాడంగి వద్ద ఉన్న రైల్ మిల్లులో నిల్వలను పరిశీలించారు.
బాడంగి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ట్రక్‌షీట్లు సక్రమంగా పొందుప రచాలని జేసీ సేతుమాధవన్ కోరారు.శనివారం మండలంలోని ముగడ, కోడూరు గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీచేశారు. అనంతరం బాడంగి వద్ద ఉన్న రైల్ మిల్లులో నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈనెల ఏడో తేదీన వచ్చిన లోడ్ ట్రక్‌షీట్ ఎందుకు ఇంకా క్లోజ్‌చేయలేదని జేసీ మిల్లునిర్వాహకులను ప్రశ్నించారు. ఎప్పటి కప్పుడు ట్రక్‌షీట్ వివరాలు పొందుపరచాలని సూచించారు. ట్రక్‌షీటు వివరాలు సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వెంట తహసీల్దార్ వరప్రసాద్, రీసర్వే డీటీ అప్పలనాయుడు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా చేయాలి
రామభద్రపురం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో వినియో గదారులకు ఇబ్బందిలేకుండా గ్యాస్ సరఫరాచేయాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ సూచించారు. రామభద్రపురంలోని రేణు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని శనివారం తనిఖీచేశారు. ఈసందర్భంగా ఇప్పటి వరకు ఉజ్వల్ కనెక్షన్లు ఎన్ని సరఫరా చేశారో అడిగి తెలుసుకున్నారు.ఐవీఆర్ కాల్స్ ఎక్కువగా నెగిటివ్‌గా వస్తున్నాయని, వీటిని నిరోధించా లని కోరారు. ఇప్పటికే ఏజెన్సీకి నోటీసులు కూడా జారీ చేశా మని తెలిపారు. ఎటువంటి తప్పులు లేకుండా గ్యాస్ సరఫరా చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఆయన వెంట తహసీల్దార్ అజురఫీజాన్ తదితరులు ఉన్నారు.