Share News

Flag మురిసిన మువ్వన్నెల జెండా

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:04 AM

The Tricolour Flag Soars with Pride హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా సాలూరు పట్టణంలో శుక్రవారం 108 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో మంత్రి సంధ్యారాణి, విద్యార్థులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 Flag   మురిసిన మువ్వన్నెల జెండా
108 అడుగుల జాతీయ జెండాతో సాలూరులో మానవహారం చేపట్టిన దృశ్యం

  • పాల్గొన్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా సాలూరు పట్టణంలో శుక్రవారం 108 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో మంత్రి సంధ్యారాణి, విద్యార్థులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు. వందేమాతరం, భారత్‌మాతాకి జై అనే నినాదాలతో పట్టణంలోని ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసి.. ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల సేవలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. వారి స్ఫూర్తితో నేటితరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:04 AM