గిరిజన విశ్వవిద్యాలయాన్ని పూర్తిచేయాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:26 AM
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.రాము డిమాండ్ చేశారు.
విజయనగరం దాసన్నపేట, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.రాము డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2012 రాష్ట్రం విడిపోయినప్పుడు విభజన హామీల్లో భాగంగా 2021లోపు విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. సుమారు ఆరేళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ నిర్మాణం పూర్తికాకుండా అద్దె భవనా ల్లో కంటైనర్‌లో తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనేక విభాగాల్లో ఖాళీ గా ఉన్న పోస్టులను నేటికీ భర్తీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు సోమేష్, శీరిష, వంశీ, రమణ, రూప, భారతి, శివ తదితరులు పాల్గొన్నారు.