Share News

కొలిక్కివచ్చిన మరుగుదొడ్ల వివాదం

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:14 AM

భోగాపురం నీళ్లట్యాంకు సమీపంలో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రైతుబజారు మరుగుదొడ్ల వివాదం బుధవారం కొలిక్కివచ్చింది. ఇక్కడ నీటి ట్యాంకు సమీపంలో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న రైతుబజారుకు సంబందించి మరుగుదొడ్ల ట్యాంకు నిర్మాణానికి కాంట్రాక్టర్‌ గోతులు తవ్వకం పనులు చేపట్టారు.

కొలిక్కివచ్చిన మరుగుదొడ్ల వివాదం
మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన వివాదంపై చర్చిస్తున్న అధికారులు:

భోగాపురం, ఏప్రిల్‌8(ఆంధ్రజ్యోతి): భోగాపురం నీళ్లట్యాంకు సమీపంలో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రైతుబజారు మరుగుదొడ్ల వివాదం బుధవారం కొలిక్కివచ్చింది. ఇక్కడ నీటి ట్యాంకు సమీపంలో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న రైతుబజారుకు సంబందించి మరుగుదొడ్ల ట్యాంకు నిర్మాణానికి కాంట్రాక్టర్‌ గోతులు తవ్వకం పనులు చేపట్టారు. నీటి ట్యాంకు సమీపంలో మరుగు దొడ్లు నిర్మిస్తే తాగునీరు కలుషితమై ప్రజారోగ్యంపై ప్రభావం పడుతుందని, దీంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా షెడ్ల పక్కన మరుగుదొడ్లు నిర్మించాలని గ్రామస్థులు పట్టుపట్టారు. దీంతో అప్పట్లో వివాదం చోటుచేసుకోవడంతో కొద్దిరోజులు మరుగు దొడ్ల పనులు నిలిపివేశారు. ఈనేపథ్యంలో బుధవారం ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ వైకుం ఠనాయుడు, మార్క్‌ట్‌కమిటీ సిబ్బంది, కాంట్రాక్టరు స్థానికులు మరుగుదొడ్ల నిర్మా ణంపై చర్చించారు. గతంలో గోతులు తీసిన ప్రాంతంలో కాకుండా రైతుబజారుకు ఆనుకొని మరుగుదొడ్లు నిర్మాణానికి అంగీకారానికి రావడంతో వివాదం సద్దుమణి గింది. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో గాయిత్రి, కార్యదర్శి ఆర్‌.జయమ్మ, నాయకులు కొమ్మూరు సుభోషణరావు, శ్రీనివాసరావు, పల్లంట్ల జగదీష్‌, గుండపు సూరిబాబు, శ్రీనివాసరావు, బొల్లుత్రినాథ్‌, రౌతువాసుదేవరావు, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:14 AM