Share News

Primal Deity. ఆదిదేవుడి పూజకు వేళాయె

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:38 AM

The time has come to worship the Primal Deity. విఘ్నాలు తొలగించే ఆదిదేవుడి పూజకు వేళయింది. వినాయక చవితి వేడులకు జిల్లావాసులు సర్వం సిద్ధం చేశారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే విద్యుత్‌ దీపాలతో మండపాలను ముస్తాబు చేశారు. సోమవారం వేడుకగా పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ వాన కురవగా.. ఆ తర్వాత వాతావరణం మారింది. కాస్త తెరిపివడంతో ప్రజలు బయటకు వచ్చి పూజా సామగ్రిని కొనుగోలు చేశారు.

 Primal Deity. ఆదిదేవుడి పూజకు వేళాయె
కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్న పార్వతీపురం ప్రధాన రహదారి

  • ముస్తాబైన గణనాథుని మండపాలు

  • కిటకిటలాడిన మార్కెట్లు

  • ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లావాసులు

  • మన్యంలో సందడి వాతావరణం

పార్వతీపురం/ పార్వతీపురం టౌన్‌/పాలకొండ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): విఘ్నాలు తొలగించే ఆదిదేవుడి పూజకు వేళయింది. వినాయక చవితి వేడులకు జిల్లావాసులు సర్వం సిద్ధం చేశారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే విద్యుత్‌ దీపాలతో మండపాలను ముస్తాబు చేశారు. సోమవారం వేడుకగా పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ వాన కురవగా.. ఆ తర్వాత వాతావరణం మారింది. కాస్త తెరిపివడంతో ప్రజలు బయటకు వచ్చి పూజా సామగ్రిని కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో పాలకొండ, సాలూరు, కురుపాం, పార్వతీపురంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో మార్కెట్లన్నీ కళకళలాడాయి. ఇదే అదునుగా.. వ్యాపారులు పండ్లు, పూలు తదితర వాటిని అధిక ధరకు విక్రయించారు. కాగా వినాయక మండపాలకు సింగిల్‌ విండో ద్వారా అనుమతుల మంజూరు, ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుండడంతో ఉత్సవ కమిటీలు ఎంతో ఉత్సాహంగా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో చిన్నారులు, యువత, పెద్దలు కలిసి ప్రఽధాన కూడళ్ల వద్ద ఆకర్షణీయంగా మండపాలు తీర్చిదిద్దారు. ముందుగానే ఆర్డర్లు ఇచ్చి వివిధ ఆకృతుల్లో రూపొందించిన గణనాఽథుని విగ్రహాలను మండపాలకు తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు అన్ని వర్గాల ప్రజలు మట్టి వినాయక విగ్రహాలు , ప్రతిమలనే కొనుగోలు చేశారు. మొత్తంగా అంతటా చవితి సందడి నెలకొంది.

మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలి

పార్వతీపురం/బెలగాం: వినాయకచవితి సందర్భంగా జిల్లావాసులు మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. మండపాల నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాల్లో నిబంధనలు పాటించాలన్నారు. ఊరేగింపులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్‌ సిస్టమ్‌లు వినియోగించరాదని వెల్లడించారు.

నిబంధనలు ఇవీ..

గరుగుబిల్లి: ‘విద్యుత్తు శాఖ నుంచి అనుమతి పొందిన మండపాలకు ఈనెల 22 వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫారా చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలో వాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలో వాట్లు వరకు ఉచితం. మండపాలకు తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్‌ను మాత్రమే వినియోగించాలి. వైర్లకు హుక్‌లు వేయకూడదు. పందిరి వద్ద వైర్లు కాలుతున్న వాసన వస్తే వెంటనే మెయిన్‌ సరఫరా నిలిపి వేసి విద్యుత్తు సిబ్బందికి సమాచారం అందించాలి. తప్పనిసరిగా ఎంసీబీ, ఆర్‌సీసీబీ/ఈఎల్‌సీబీ అమర్చాలి. ఒకే సాకెట్‌కు అనేక ప్లగ్‌లు, ఎక్స్‌టెన్షన్‌ బోర్డులు పెట్టి ఓవర్‌ లోడ్‌ చేయకుడదు. ’ అని విద్యుత్‌ శాఖాధికారులు తెలిపారు.

Updated Date - Sep 14 , 2026 | 12:38 AM