The time for the swearing-in ceremony has arrived.ప్రమాణ స్వీకారానికి వేళాయే
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:36 PM
The time for the swearing-in ceremony has arrived. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మునిసిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరేందుకు సమయం ఆసన్నమైంది. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం వారంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయనగరంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ తంతు ప్రారంభం కానుంది.
ప్రమాణ స్వీకారానికి వేళాయే
- నేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు
- ఉదయం 11గంటలకు ముహూర్తం
- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
విజయనగరం టౌన్/బొబ్బిలి/నెల్లిమర్ల, నవంబరు22(ఆంధ్రజ్యోతి):
విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి మునిసిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరేందుకు సమయం ఆసన్నమైంది. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం వారంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయనగరంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఈ తంతు ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్పొరేషన్‌లో కొత్తగా ఎన్నికైనా 62మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గంట వ్యవధిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగనుంది. తొలుత ఉదయం 8గంటలకు అశోక్ బంగ్లా నుంచి నూతనంగా ఎన్నికైన మేయర్‌తో పాటు కూటమికి చెందిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు కార్పొరేషన్ కార్యాలయానికి ర్యాలీకి బయలుదేరనున్నారు. కాగా డిప్యూటీ మేయర్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవికి ఇప్పటి వరకూ ఎవరి పేరును ఖరారు చేయకపోవడంతో ఎవరిని వరిస్తుందోనని అంతా ఎదురుచూ స్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి టీడీపీకి కేటాయించినప్పటికీ అభ్యర్థి పేరు తేలలేదు. ఏదేమైనప్పటికీ ముందుగా మేయర్ ప్రమాణ స్వీకారం తరువాత ఒక్కో కార్పొరేటర్ ప్రమాణం చేస్తారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నిక చేతులు ఎత్తే పద్ధతిలో జరుగుతుంది.
- నెల్లిమర్ల నగరపంచాయతీ నూతన కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా సోమవారం జరుగనుంది. స్థానిక బైరెడ్డి సూర్యనారాయణ మున్సిపల్ కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. చైర్మన్‌గా ఎన్నికైన లెంక అప్పలనాయుడు, 23 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం 11 గంటలకు ప్రత్యేక సమావేశం జరగనుంది. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు.
- బొబ్బిలిలో మునిసిపల్ నూతన చైర్‌పర్సన్ రాంబార్కి రేణుకాదేవి స్వప్నతో పాటు 36 మంది కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని కమిషనరు లాలం రామలక్ష్మి తెలిపారు. ప్రిసైడింగ్ అధికారి.. ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు ఆధ్వర్యంలో మునిసిపల్ కౌన్సిల్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. అనంతరం వైస్‌చైర్మన్ ఎన్నికను చేతులెత్తే పద్ధతిలో నిర్వహిస్తారని ఆమె తెలిపారు.