The time for the immersion festival has arrived. నిమజ్జనోత్సవానికి వేళాయె
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:52 PM
The time for the immersion festival has arrived. వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా బుధవారం చాలాచోట్ల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. మంగళవారంతో నవరాత్రులు ముగియగా బుధవారం భారీ ఎత్తున నిమజ్జనాలు చేసేందుకు నిర్వాహకులు నిర్ణయించారు.
నిమజ్జనోత్సవానికి వేళాయె
జిల్లా వ్యాప్తంగా 4, 713 గణేష్ మండపాలు
నేడు ఎక్కువ సంఖ్యలో నిమజ్జనాలు
పోలీస్ శాఖ పక్కా ఏర్పాట్లు
జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం తప్పదని హెచ్చరిక
విజయనగరం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా బుధవారం చాలాచోట్ల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. మంగళవారంతో నవరాత్రులు ముగియగా బుధవారం భారీ ఎత్తున నిమజ్జనాలు చేసేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. డీజే సౌండ్స్‌తో పాటు వివిధ రకాల కళరూపాల ప్రదర్శనలతో బొజ్జగణపయ్యను ఊరేగింపుగా తరలించనున్నారు. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసులు, అధికారులు నిర్వాహకులకు కీలక సూచనలు చేస్తున్నారు. నిమజ్జనోత్సవంలో ఎటువంటి అపశృతులు చోటుచేసుకోకుండా చూడాలని ఎస్పీ దామెదర్ ఆదేశించారు. ఎతైన విగ్రహాల ఊరేగింపులో నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో కూడా మాట్లాడి తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 4,713 వినాయక మండపాలు ఏర్పాటుచేసినట్టు ఆన్‌లైన్ గణాంకాలు చెబుతున్నాయి. వారిని ఆన్‌లైన్‌లో పోలీస్ శాఖ అనుమతులు ఇచ్చింది. వీటిలో ఎక్కువ గణపతి ప్రతిమలు బుధవారం నిమజ్జనం కానున్నాయి.
జిల్లాలో నాగావళి,చంపావతి, తోటపల్లి, మడ్డువలస కాలువలు, వేలాది చెరువులు ఉన్నాయి. మరోవైపు భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో సముద్ర తీర ప్రాంతం ఉంది. అన్నిచోట్లా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తరలించనున్నారు. ఈ పరిస్థితిలో అధికారులు నిర్వాహకులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులను నిమజ్జనానికి వెళ్లకుండా చూడాలని చెప్పారు. వీలైనంత తొందరగా నిమజ్జన ప్రక్రియను పూర్తిచేయాలన్నారు.
----------------