Share News

మాతాశిశు సంరక్షణ కోసమే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:03 AM

మాతాశిశు సంరక్షణలో భాగంగా కూటమి ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతోందని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు.

మాతాశిశు సంరక్షణ కోసమే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జయకృష్ణ

‘సీతంపేట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మాతాశిశు సంరక్షణలో భాగంగా కూటమి ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతోందని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో బుధవారం మండలానికి మంజూరైన రెండు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువులతో పాటు తల్లులకు ఆసుపత్రి నుంచి ఇంటికి క్షేమంగా చేర్చడంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలు గిరిజన ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు, డా.డి.వి.శ్రీనివాస్‌, కూటమి నాయకులు పవన్‌, హిమరక ప్రసాదరావు, కోటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 12:03 AM